ఇక మీ తప్పులన్నీ ఒప్పుకోండి

కరోనా బారిన పడి, మృత్యుముఖం దాక వెళ్లొచ్చారు..వర్ల రామయ్య

varla ramaiah
varla ramaiah

అమరావతి: టిడిపి నేత వర్ల రామయ్య, వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి పై విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా విజయసాయిరెడ్డి తాను చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకోవాలని ఆయన సూచించారు. ‘విజయ సాయి రెడ్డి గారూ! కరోనా బారిన పడి, మృత్యుముఖం దాక వెళ్లి, అదృష్టం, బయట పడ్డారు. ఇది మీకు పునర్జన్మ. ఇక మీ తప్పులన్ని ఒప్పుకోండి. సీబీఐ కోర్టులో మీ కేసులలో ‘అప్రోవర్ఖి గా మారండి. మారిన మనిషిగా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చిన మీ కేసులకు న్యాయ పరిష్కారం చూపండి’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/