రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ భారం రూ.4కి పెంచడం తగదు

సామాన్యుడిపై, ధనవంతుడిపై ఒకేలా పన్ను పెంపు న్యాయమా?

somireddy chandramohan reddy
somireddy chandramohan reddy

అమరావతి: టిటిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఏపిలో ట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంపుపై విమర్శలు గుప్పించారు. కరోనా సంక్షోభం వల్ల తలెత్తిన పరిస్థితుల వల్ల అల్లాడిపోతోన్న ప్రజలపై మరింత భారం మోపారని అన్నారు. ‘అసలే పెరిగిన పెట్రో ధరలతో ప్రజలు అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ భారం రూ.4కి పెంచడం తగదు. మోపెడ్ నడిపే సామాన్యుడిపై, ఆయిలింజన్ ఉపయోగించే సన్నకారు రైతుపై, బెంజ్ కారు వాడే ధనవంతుడిపైనా ఒకేలా పన్ను పెంపు న్యాయమా? ఈ ప్రభావం నిత్యావసరాల ధరలపై పడి పేదలకు ఇంకా భారమయ్యే ప్రమాదముంది’ అని విమర్శించారు.

‘గతంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టిటిపి ప్రభుత్వ హయాంలో రూ.2 భారం తగ్గించిన సందర్భాలున్నాయి. ఓ వైపు ధరలు, మరోవైపు పన్ను పెంచి కరోనా కాలంలో ప్రజలను మరింత కష్టాలకు గురిచేయడం దారుణం. పెంచిన వ్యాట్ ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి’ అంటూ ఆయన డిమాండ్ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/