మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అరెస్ట్

హైదరాబాదులోని కొండాపూర్ నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్: టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో కాసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ఆయన వాహనంలోనే ఏపీకి తరలించారు. ఆయన వెంట ఆయన భార్య రమాదేవి ఉన్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.

ఏపీలో పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ కావడం వెనుక నారాయణ విద్యాసంస్థలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏ కేసు కింద నారాయణను అదుపులోకి తీసుకున్నారనే విషయం పోలీసులు చెప్పకపోవడం గమనార్హం. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఆయను అదుపులోకి తీసుకున్నారని కుటుంబసభ్యులు చెపుతున్నారు. కాసేపట్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/