భవిష్యత్తులో తప్పకుండా సమధానం చెప్తాం

nakka anand babu
nakka anand babu

గుంటూరు: వైఎస్‌ఆర్‌సిపి సర్కారు అధికారంలో వచ్చాక విపక్షాలపై అక్రమ కేసులు, దాడులు సర్వసాధారణ మయ్యాయని టిడిపి పార్టీ సీనియర్‌ నేత మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. గుంటూరులోని టిడిపి కార్యలయంలో పల్నాడు ప్రాంతానికి చెందిన వైఎస్‌ఆర్‌సిపి బాధితులతో మాజీ ఎమ్మెల్యె యరపతినేనితో పాటు ఆయన సమావేశమయ్యారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇలాంటి అరాచక పరిస్థితులు లేవని, ఆ సమయంలో తాము కూడా దాడులకు పాల్పడివుంటే ఈ పాటికి వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కనుమరుగయ్యేదని నక్కా వ్యాఖ్యానించారు. చింతమనేని, కోడెల శివప్రసాద్‌, యరపతినేని వంటి ముఖ్య నేతలపై కేసులు పెట్టి వేధించారని ఆనంద్‌బాబు వివర్శలు చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులతో ఎంతకాలం పరిపాలన సాగిస్తారని అన్నారు. ఈ అరచకాలకు భవిష్యత్తులో తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇంకా ఎమ్మెల్యె యరపతినేని మాట్లాడుతూ పోలీసుల సాయంతో ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/