రాష్ట్రానికి సిఎం విజయసాయిరెడ్డా? జగనా?

టిడిపి నేత దేవినేని ఉమ తీవ్ర విమర్శలు

Devineni Uma Maheswara Rao
Devineni Uma Maheswara Rao

అమరావతి: రాష్ట్ర రాజధానిని ప్రకటించడానికి విజయసాయిరెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రా? అని టిడిపి నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగనా? లేక విజయసాయిరెడ్డా? అని ఆయన ఆగ్రహించారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ మధ్య కూర్చుని రాష్ట్ర రాజధానిని వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఏం అర్హత ఉందని రాజధానిని ఆయన ప్రకటించారని దేవినేని ఉమ ప్రశ్నించారు. ఆయనకు ఎంత ధైర్యం, ఎంత అహంకారం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినేట్‌ మీటింగ్‌ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆయనెవరు విజయసాయి రెడ్డి అని ప్రస్తావించారని ఉమ అన్నారు. ఆయన ప్రకటించిన రాజధానితో మాకేంటి సంబంధం అన్నారుని తెలిపారు. చంద్రబాబును తిట్టేందుకు కేబినేట్‌ మీటింగ్‌ పెట్లుకోవాలా? అది కేబినేట్‌ బ్రీఫింగా? లేక కామెడీనా? అనేది అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖలో రాజధాని అంశంపై చేసిన వ్యాఖ్యలను ఖండించాలని సిఎం జగన్‌ను డిమాండ్‌ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/