ఇంత గజిబిజి ఎన్నికలు ఎప్పుడూ నిర్వహించలేదు

ఎన్నికలపై నిఘా.. ప్రభుత్వానికి ఏం అవసరం: చంద్రబాబు

Chandrababu
Chandrababu

అమరావతి: ఎన్నడూ లేని విధంగా, గజిబిజిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల వ్యవహారంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. రిజర్వేషన్లను ఇష్టానుసారం ప్రకటించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడా లేనిది, షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ అన్నీ ఒకేసారి విడుదల చేస్తారా అని ప్రశ్నించారు. నిఘా యాప్‌కు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం ఏమిటని? స్థానిక ఎన్నికలపై నిఘా పెట్టేంత అవసరం ప్రభుత్వానికి ఏముందని ఆయన మరోసారి ప్రశ్నించారు. ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల సంఘం చూసుకుంటుందని పేర్కొన్నారు. సూపర్ ఎలక్షన్ కమిషనర్ గా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిర్వాకం వల్లే బీసీ రిజర్వేషన్లు గణనీయంగా తగ్గాయని అన్నారు. ఈ ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా పంచేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. మద్యం, నగదు పంచుతుంటే ప్రజలే ఎక్కడిక్కడ పట్టించాలని ఉద్బోధించారు. ఒక్క అవకాశం ఇస్తే ఏమయ్యిందో 10 నెలలుగా చూస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈసారి మనస్సాక్షితో ఆలోచించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/