దాడిపై స్పందించిన బుద్ధా వెంకన్న

Buddha venkanna
Buddha venkanna

మంగళగిరి: టిడిపి నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమ లపై గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన దాడిపై టిడిపి పార్టీ తీవ్రంగా స్పందించింది. దీనిపై మంగళగిరి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. దాడిపై వైఎస్‌ఆర్‌సిపి నేతలు కుంటి సాకులు మానుకోవాలని బుద్ధా సూచించారు. అబద్దపు ప్రచారంతో దాడిని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇవాళ మేము ఏదో చెడు చేయాలని వెళ్లి ఉంటే మాత్రం మాప్రాణాలు పోయుండేవని ఆయన అన్నారు. బొండా ఉమ, తాను శవాలు గా తిరిగి వచ్చే వాళ్లమని, దేవుడి దయ వల్ల అలాంటిదేమీ జరగలేదని ఆయన అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/