జగన్‌ ప్రభుత్వంపై బోండా ఉమ విమర్శలు

జగన్ పాలనలో వచ్చిన ప్రజావ్యతిరకతకు వైఎస్‌ఆర్‌సిపికి వెన్నులో వణుకు పుడుతోంది..బోండా ఉమ

విజయవాడ: జగన్‌ ప్రభుత్వంపై టిడిపి నేత బోండా ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనటానికి ఎన్నికల కమిషనర్ నిమ్మడ రమేష్ కుమార్ సంఘటనే నిదర్శనమన్నారు. బహిరంగంగా వైఎస్‌ఆర్‌సిపి నాయకులు మారణాయుధాలతో తిరుగుతున్నా డీజీపీకి కనపడటం లేదని విమర్శించారు. పంచాయతీ ఎన్నికలలో గెలుపు కోసం వైఎస్‌ఆర్‌సిపి నేతలు దౌర్జన్యలు చేస్తున్నా.. పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.

20 నెలల జగన్ పాలనలో వచ్చిన ప్రజావ్యతిరకతకు వైఎస్‌ఆర్‌సిపికి వెన్నులో వణుకు పుడుతోందన్నారు. స్థానిక ఎన్నికలను కేంద్ర బలగాలతో నిర్వహించే విధంగా ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డను కించపరిచే విధంగా మాట్లాడినా మంత్రులు, ఎమ్మెల్యే, సలహాదారులపై సుమోటోగా క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. చిన్న చిన్న విషయాలకే క్రిమినల్ కేసులు పెట్టిన పోలీసులకు అత్యున్నత పదవిలో ఉన్న వారిని బహిరంగంగా దూషిస్తున్న కనబడుటలేదా? అని బోండా ఉమ ప్రశ్నించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/