రాజధానులు కాదు.. ప్రత్యేక హోదాను తీసుకురండి

టిడిపి నేతలు అశోక్‌ బాబు, బచ్చుల అర్జునుడు

Ashok babu
Ashok babu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండవచ్చునంటూ ఏపి ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంగా టిడిపి నేత అశోక్‌ బాబు మాట్లాడుతూ.. ఏపికి మూడు రాజధానులు అనేది జగన్‌ ఆలోచన మాత్రమే అని వైఎస్‌ఆర్‌సిపి నేతలు చెబుతున్నారని అన్నారు. రాజధానిని ఐదు చోట్ల పెట్టండి, మూడు చోట్ల ఎందుకూ అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను, ప్రత్యేక హోదాను తీసుకురావడం చేతకాక రాజధాని వికేంద్రీకరణ అంటున్నారని అశోబాబు చెప్పారు. మరో టిడిపి నేత బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ.. అనాలోచితంగా చేసిన ప్రకటనను సిఎం జగన్‌ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/