ఆలపాటి రాజేంద్రప్రసాద్ అరెస్టు
రాజధాని కోసం రైతులు చేస్తున్న పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ గుంటూరు జిల్లా తెనాలి నుంచి అమరావతికి టిడిపి నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో రైతులు పాదయాత్రగా బయల్దేరారు. రైతుల పాదయాత్ర వల్ల గుంటూరు-తెనాలి మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతారాయం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నంది వెలుగు సమీపంలోకి పాదయాత్ర చేరుకోగానే పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితులు అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ను అరెస్టు చేశారు. అక్కడి ఆయనను పోలీసు జీపులో దుగ్గిరాల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా రైతులు, టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/