మన కలలను మనమే సాకారం చేసుకోవాలి
అమరావతి అనేది చంద్రబాబు కల

అమరావతి: టిడిపి నేత కేశినేని నాన్ని అమరావతి రాజధానిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. ‘మన కలలను మనమే సాకారం చేసుకోవాలి. మన కలలను ఎదుటి వారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం. అమరావతి అనేది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కన్న కల. అది సాకారం అవ్వాలంటే 2024లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఆ దిశగా పార్టీలో అందరూ పాటుపడాలి. మీడియా సమావేశాల వల్ల, పేపర్ స్టేట్మెంట్స్ వల్ల ప్రయోజనం లేదు’ అని కేశినేని నాని ట్వీట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/