అందుకే ఎన్నికల్లో టీడీపీ నామమాత్రంగా పోటీ: గోరంట్ల

ప్రజా స్వేచ్ఛని హరించి గెలిచారు: గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి

అమరావతి: ఏపీలో జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో వైస్సార్సీపీ అత్య‌ధిక స్థానాల్లో విజయం సాధించిన విష‌యం తెలిసిందే. త‌మ పార్టీ ఏక‌ప‌క్ష విజ‌యం సాధించిందని, టీడీపీ ఘోరంగా ఓడిపోయింద‌ని వైస్సార్సీపీనేత‌లు చేస్తోన్న వ్యాఖ్య‌ల ప‌ట్ల టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి స్పందిస్తూ కౌంట‌ర్ ఇచ్చారు.

“ఊహించిన గెలుపున‌కు బాజాలు… అవి ‘ఎలక్షన్స్ కాదు సెలెక్షన్స్’.. ప్రజా స్వేచ్ఛని హరించి గెలిచారు. ఎన్నికల్లో అందుకే టీడీపీ నామమాత్రంగా పోటీ.. బహిష్కరణ చేసిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి ఏంటీ? వైస్సార్సీపీ ఏకపక్ష విజయం ఏంటి?” అని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/