డొక్కా మాణిక్య వరప్రసాద్ బహిరంగ లేఖ
రాజీనామాపై లేఖలో వివరణ ఇచ్చిన డొక్కా

అమరావతి: టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. డొక్కా బహిరంగ లేఖ ప్రకారం.. మిత్రులు, శ్రేయోభిలాషులకు… ‘నేడు డొక్కా మాణిక్య వరప్రసాద్ రాస్తున్న బహిరంగ లేఖ’ అంటూ ఆయన ప్రారంభించారు. తను ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని డొక్కా వ్యాఖ్యానించారు. అతేకాకుండా అసెంబ్లీ సమావేశాలకు ముందే తాను మానసికంగా వైఎస్ఆర్సిపి వైపు మొగ్గు చూపానని, కానీ ఆ పార్టీ నేతలతో మాత్రం చర్చించలేదని స్పష్టం చేశారు. అయితే తనపై వస్తున్న విమర్శలు చాలా బాధిస్తున్నాయని ఆ లేఖలో ఆయన వాపోయారు. తనపై చేస్తున్న చౌకబారు విమర్శలను తను తీవ్రంగా ఖండిస్తున్నాని ఆయన అన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/