టిడిపి మేనిఫెస్టో కమిటి సమావేశంYanamala Ramakrushnudu
Yanamala Ramakrushnudu


మరో ఒకట్రెండు భేటీలతో మేనిఫెస్టోను ఖరారు
రైతు, మహిళ, యువత, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక లబ్ధి

అమరావతి: యనమల రామకృష్ణుడు అధ్యక్షతన అమరావతి ప్రజావేదికలో టిడిపి ఎన్నికల మేనిఫెస్టో కమిటి సమావేశమైంది. 2019 ఎన్నికల ప్రణాళికకు వీరు తుదిమెరుగులు దిద్దారు. రైతు, మహిళ, యువత, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే ప్రధాన ఎజెండాగా ఈ కమిటీ నివేదికను సిద్ధం చేస్తోంది అయితే ఇంకా ఒకట్రెండు సమావేశలతో మేనిఫెస్టోను ఖారారు చేసి సిఎం చంద్రబాబుకు అందజేయనున్నారు. ఈసమావేశంలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ స్వాతిరాణి, అధికార ప్రతినిధి పి.అనురాధ, మాజీ మంత్రి పుష్పరాజ్, ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.