మంగళగిరిలో టిడిపి శ్రేణుల నిరసన

ఇసుక కొరతపై ధర్నా

lokesh-tdp leaders
lokesh-tdp leaders

మంగళగిరి: ఇసుక కొరత సృష్టించి నిరుపేదలకు పనుల్లేకుండా చేసి వారి పొట్టకొట్టారని టిడిపి నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర ఇసుక కొరతను నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో టిడిపి శ్రేణులతో కలిసి ఈరోజు ఉదయం ఆయన ధర్నాకు దిగారు. పాతబస్టాండ్‌ వద్ద మూతపడిన అన్న క్యాంటీన్‌ ఎదుట బైఠాయించిన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడమేకాక, ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా, ధర్నాలో పాల్గొన్న పలువురు నిర్మాణ రంగ కూలీలు ఇసుక కొరత వల్ల పనులు నిలిచిపోయి ఉపాధి లేక తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ పేదల రాజ్యాన్ని జగన్‌ పులివెందులుగా మార్చేశారని ధ్వజమెత్తారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/