పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్ప‌లేదు

రైతుకు నగదు బదిలీ చేయాలని చెప్పలేదు

devineni uma
devineni uma

అమరావతి: టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వరరావు వైఎస్‌ఆర్‌ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని, రైతుకు నగదు బదిలీ చేయాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. మినిట్స్ కాపీలో మీటర్ల మాటే లేదు. ఉచిత విద్యుత్ పట్ల మీ ప్రభుత్వ వైఖరితో రైతులు ఆందోళన చెందుతున్నా, మీటర్లు బిగించి తీరుతామంటూ మీరు చేసే అప్పుల కోసం రైతుల జీవితాలు తాకట్టుపెడతారా? అదనపుభారం సంగతేంటి? వైఎస్ జ‌గ‌న్ గారూ?ఖి అని ప్ర‌శ్నించారు.

గ‌తంలో చంద్రబాబు నాయుడు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్గ పెడతామన్నప్పుడు వైఎస్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ భారీ ఉద్యమమే నడిపిందని అందులో పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారని, ఇప్పుడు మాత్రం మళ్లీ విద్యుత్‌ సంస్కరణల పేరిట జగన్‌ సర్కారు పంపుసెట్లకు మీటర్లు పెడుతోంద‌ని, నగదు బదిలీ అమలు చేయాలని నిర్ణయించిందని అందులో పేర్కొన్నారు. విమ‌ర్శ‌లు రావ‌డంతో కేంద్రం చెప్పింది కాబ‌ట్టి తాము చేస్తున్నామ‌ని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అంటోంద‌ని అందులో తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/