17 నెలలలో పెట్టుబడులు సున్నా

లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకి వెళ్లాయి..దేవినేని

devineni uma maheswara rao
devineni uma maheswara rao

అమరావతి: టిడిపి దేవినేని ఉమా మహేశ్వరరావు సిఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ‘నాడు నారా చంద్రబాబు నాయుడి హయాంలో ఐటీ రాజధానిగా విశాఖజోరు. నేడు లూలూ, అదానీ, టెంపుల్టన్ భూములు లాక్కున్నారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకి వెళ్లాయి. 17 నెలలలో పెట్టుబడులు సున్నా. పీపీఏల పునఃసమీక్షతో ప్రపంచ వేదికలపై భారతదేశ పరువు తీశారు. రాజకీయకక్ష సాధింపుకి యువత భవిష్యత్తుని తాకట్టు పెడతారా?’ అంటూ ప్రశ్నించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అక్కడ విస్తరిస్తున్న ఐటీ అభివృద్ధికి మాత్రం పాతరేసిందని పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వం సీమాంధ్రకు ఐటీ కంపెనీలను రప్పించేందుకు ప్రయత్నించిందని, వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం మాత్రం అసలు ఐటీ రంగం అనేది ఒకటుందనే విషయాన్ని కూడా మరిచిపోయిందని చెప్పింది. దీంతో రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కూడా వెళ్లిపోయే పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/