జగన్ ను ఫ్యామిలీ తో కూడా గడపనివ్వరా..దీనిని కూడా రాజకీయం చేస్తే ఎలా..?

cm jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాల్గు రోజుల నిమిత్తం రాష్ట్రాన్ని వదిలి ఫ్యామిలీతో గడపబోతున్నారు. జగన్ 25 వ పెళ్లి రోజు సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లారు. అయితే ఈ టూర్ ను కూడా తెలుగుదేశం నేతలు రాజకీయం చేస్తున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే సీఎం జగన్ విహార యాత్రలకు వెళ్తారా..? అంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

రాష్ట్రం అప్పుల్లో ఉండటానికి, జగన్ వ్యక్తిగత పర్యటనలకు ఏమైనా సంబంధం ఉందా.. ఆ మాటకొస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు మిగులు నిధులున్నాయి, ఏపీ అప్పుల్లో ఉంది. ఆ దిగులుతో చంద్రబాబు ఒంటి పూట భోజనం చేశారా, మిగులు నిధులున్నాయి కదా అని కేసీఆర్ ఆరు పూటలు భోజనం చేశారా? లేదు కదా..అధికారాన్ని అడ్డం పెట్టుకుని, చంద్రబాబు, లోకేష్.. ఎన్నిసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారో లెక్కే లేదు. అంతర్జాతీయ సమ్మిట్ ల పేరుతో ప్రజా సొమ్ముని నీళ్లలా ఖర్చు చేశారు. పాలన పట్టించుకోకుండా, వ్యక్తిగత స్వార్థం చూసుకున్నారు ఆలా చేయడం వల్లే రాష్ట్రం ఇలా ఉందంటూ వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు.