కుప్పంలో నాలుగు రోజులపాటు చంద్రబాబు పర్యటన

11న బెంగళూరు మీదుగా రోడ్డుమార్గంలో కుప్పం

అమరావతి: టీడీపీ అధినేత, నారా చంద్రబాబునాయుడు ఈ నెల 11 నుంచి నాలుగు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 11న బెంగళూరు మీదుగా రోడ్డు మార్గంలో చంద్రబాబు కుప్పం చేరుకుంటారు. 11, 12వ తేదీల్లో కుప్పం మునిసిపాలిటీ, మండలంలో, 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో, 14న గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో స్థానిక నేతలు నిన్న ఏర్పాట్లను పరిశీలించి, సమీక్షించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/