నేడు ఏపి గవర్నర్‌తో చంద్రబాబు భేటి
రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను వివరించనున్న చంద్రబాబు

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఏపి గవర్నర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న పలు విషయాలను ఆయనతో చర్చించనున్నారు. ముఖ్యంగా టిడిపి నేతలపై దాడులు, అరెస్టులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే, రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని, రాజ్యాంగ వ్యవస్థలను ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తోందని ఫిర్యాదు చేయనున్నారు. నాలుగు రోజుల్లో ముగ్గురు బీసీ మంత్రులపై తప్పుడు కేసులు బనాయించిన విషయంతోపాటు వైఎస్‌ఆర్‌సిపి నేతల అవినీతి కుంభకోణాలపైనా గవర్నర్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/