పండుటాకులను మోసం చేయడం కాదా?

లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తే పెరగాల్సింది పోయి తగ్గడం ఏమిటి?

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేశారు. ఫించను అర్హత వయసు ఐదేళ్లు తగ్గిస్తే లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గడం వింతగా ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏమిటి జగన్మాయ అని ముఖ్యమంత్రి జగన్‌ని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో 7లక్షల పింఛన్ల కోత పెట్టడం పండుటాకులను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు పింఛను ఇస్తామని హామీ ఇచ్చి వారిని ఏమార్చడం మోసం కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంకా మరో ట్వీట్‌లో కేంద్రం ఇచ్చిన రూ.6 వేలకు అదనంగా రూ.12,500 ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారు. నిరుద్యోగభృతి రద్దు చేసి యువతకు టోపీ పెట్టారు. ఇంత మోసకారి కాబట్టే 12 ఛార్జిషీట్లలో ఇప్పటికీ 420 సెక్షన్‌ కింద విచారణ ఎదుర్కొంటున్నారని సీఎం జగన్‌ను దుయ్యబట్టారు. అయినా మోసాలు చేయడం మాత్రం మానుకోవట్లేదని చంద్రబాబు విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/