రేపు ‘చలో నర్సీపట్నం’ పిలుపునిచ్చిన టీడీపీ

పంట కాల్వను ఆక్రమించి గోడను నిర్మించారని, ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ నర్సీపట్నంలోని అయ్యనపాత్రుడి ఇంటి గోడను జేసీబీ లతో కూల్చారు. దీనిపట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యన్న ఇంటిగోడను కూల్చడాన్ని నిరసిస్తూ.. రేపు చలో నర్సీపట్నంకు టీడీపీ పార్టీ పిలుపునిచ్చింది. రాజకీయ కక్ష సాధింపుతో వైస్సార్సీపీ ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గతంలో పల్లా శ్రీనివాస్, సబ్బం హరి ఆస్తులపైనా దాడి చేశారని గుర్తు చేశారు. ప్రశ్నించిన వారిపై దాడి చేయడం వైస్సార్సీపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. బీసీల పట్ల జగన్ చూపిస్తున్న కపట ప్రేమను నిలదీస్తామని అచ్చెన్న వ్యాఖ్యనించారు.

అయ్యన్న ఇంటి గోడను కూల్చడం పట్ల నర్సీపట్నం టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. అయ్యన్న పాత్రుడి ఇంటి వద్దకు భారీగా చేరుకున్నా. దాంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. అటు తమ ఇంటిని కూల్చివేయడాన్ని అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యులు తప్పుబడుతున్నారు. నర్సీపట్నం మున్సిపల్ అధికారులు, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇంటికి మున్సిపల్ అధికారుల అనుమతి ఉందని.. అయ్యన్న ప్రశ్నిస్తున్నాడని ప్రభుత్వం కక్ష గట్టిందని ఆరోపించారు.ఇల్లు నిర్మించిన స్థలంలో ఆక్రమణ ఉంటే సర్వే చేయాలని అయ్యన్నపాత్రుడు చిన్న పాత్రుడు చిన్న కుమారుడు స్థానిక ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఎంత వరకు ఆక్రమణ ఉందో మార్క్ చేసి చేస్తే తామే నిర్మాణాన్ని తొలగిస్తామని చెప్పారు. ఆక్రమణ లేనిపక్షంలో తొలగించిన గోడను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.