చంద్ర‌బాబు మాత్రం విజ‌న్‌తో ప‌నిచేశారు

23 సంవత్సరాల క్రితం హైటెక్ సిటీని ప్రారంభించింది ఈ రోజే: బుద్ధా వెంక‌న్న‌

అమరావతి: సీఎం జగన్ పై టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్‌లో చేసిన అభివృద్ధి ప‌నుల‌ను, జ‌గ‌న్ తీరును ఆయ‌న ప్ర‌స్తావించారు.

‘జగన్ రెడ్డి అక్రమంగా సంపాదించి జైల్ కి వెళ్లి ఎనిమిది సంవత్సరాల క్రితం కండీష‌నల్ బైయిల్ పైన ఇదే రోజు బయటకి వచ్చాడు. 23 సంవత్సరాల క్రితం కొన్ని తరాలు అత్యుత్తమ ఉద్యోగాలు చేసేలా చంద్రబాబు దార్శనికతతో హైటెక్ సిటీని ప్రారంభించింది ఈ రోజే’ అని బుద్ధా వెంక‌న్న చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/