జయరాంపై ఏసీబీ కేసు న‌మోదు చేయాలి

acham naidu
acham naidu

అమరావతి: కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ఇట్టినా ప్లాంటేషన్‌ కంపెనీ విషయంలో జరుగుతోన్న ఆందోళనలపై టిడిపి నేత అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. మంత్రి గుమ్మనూరు జయరాంపై పలు ఆరోపణలు చేశారు. ‘ఇట్టినా కంపెనీకి సంబంధంలేని మంజునాథ్ ని కీలుబొమ్మ‌గా చేసుకుని 450 ఎకరాలు కొట్టేశాడు.. మంత్రి గుమ్మనూరు జయరాంపై ఏసీబీ కేసు న‌మోదు చేయాలి’ అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. కాగా, మంత్రి జయరాం బెదిరించి భూములు లాక్కున్నారని టీడీపీ నేతలు కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. బాధితులను భయపెట్టి రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారని ఇటీవలే టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపణలు చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/