టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా జీవీరెడ్డి: అచ్చెన్నాయుడు

పలువురు నేతలను కీలక పదవుల్లో నియమించిన అచ్చెన్నాయుడు


అమరావతి: ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గానికి చెందిన జీవీరెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ప్రకటించారు. అలాగే, మరికొందరు నేతలను కీలక పదవుల్లో నియమించారు. నెట్టెం రఘురామ్‌ను విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించగా, తిరువూరుకు చెందిన రఘువరపు శ్రీనివాసరావు, మైలవరానికి చెందిన కలకొండ వీర సత్యనారాయణ, విజయవాడ తూర్పుకు చెందిన లింగమనేని శివరామ్‌ప్రసాద్, నందిగామకు చెందని వడ్డెల్లి సాంబశివరావు, మైలవరానికి చెందిన బొమ్మసాని సుబ్బారావు, విజయవాడ పశ్చిమకు చెందిన ఎం.తిరుమలేశ్, విజయవాడ సెంట్రల్‌కు చెందిన డీజేపీఎన్ రాజును ఉపాధ్యక్షులుగా నియమించారు.

అలాగే, వాసం మునయ్యను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ బాధ్యుడిగా మన్నె సుబ్బారెడ్డిని, పి.గన్నవరానికి చెందిన వాసంశెట్టి వీర వెంకట సత్యనారాయణను బీసీ పెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా, విజయవాడకు చెందిన మహమ్మద్ ఫతావుల్లాను మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/