జీఎస్టీ వసూళ్ల లక్ష్యం పెంపు

న్యూఢిల్లీ: రాబోయే రెండు నెలలకు జీఎస్టీ వసూళ్ల లక్ష్యాన్ని పెంచుతూ పన్ను అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జనవరి, ఫిబ్రవరిలో రూ. 1.15లక్షల కోట్లు, మార్చి నెలలో రూ.1.25 లక్షల కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు రెవెన్యూ కార్యదర్శి అజ§్ు భూషణ్ పాండే నేతృత్వంలో శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు నెలకు రూ. 1.1 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు..తాజాగా దాన్ని రూ. 1.15 లక్షల కోట్లకు పెంచారు. అంతేగాక జీఎస్టీ రిటర్నుల్లో మోసాలను గుర్తించి..వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సదరు వర్గాలు తెలిపాయి.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/