జాగ్వార్‌ను విక్రయించేప్రతిపాదన ఏదీలేదు

chandrasekharan
chandrasekharan

న్యూఢిల్లీ : టాటా సన్స్‌ ఆధ్వర్యంలోని జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ను విక్రయించేప్రతిపాదన ఏదీలేదని, అయితే కంపెనీకి వ్యూహాత్మక భాగస్వాములకోసం అన్వేషణజరుపుతున్నట్లు టాటాసన్స్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేకరన్‌ వెల్లడించారు. మా గ్రూప్‌ సంస్థలకు ఆటోమొబైల్‌రంగమే కీలక వ్యాపారమని, రాబడులపరంగా కూడా ఆటోరంగం తమ కంపెనీకి ఎక్కువ వాటా ఇస్తుందన్నారు. 2008లోనే టాటామోటార్స్‌ ఫోర్డ్‌ మోటార్‌నుంచి జాగ్వార్‌ఎక్స్‌ఇ సెడాన్‌, ల్యాండ్‌రోవర్‌ డిస్కవరీ ఎస్‌యువిని కొనుగోలుచేసింది. రష్యా,చైనావంటి దేశాల్లో వాటి విక్రయాలు హోరుజోరుగా కొనసాగినంతకాలం కంపెనీకి కామధేనవుగా రాబడులపరంగానిలిచింది. అయితే ఇపుడున్న పరిస్థితిల్లో ప్రపంచ వ్యాప్తంగా పొదుపు కార్యాచరణ అవలంభిస్తోంది. 3.2 బిలియన్‌ డాలర్ల పొదుపుప్రణాళికనున అమలుచేసేందుకు వేలాది ఉద్యోగాలపై వేటువేసింది. టాటా ఆటోమోటివ్‌ బిజినెస్‌ భారత్‌ మార్కెట్‌లో కొంత మందగమనాన్ని నమోదుచేసింది. విదేశాల్లోకూడా కొన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. చైనాలో ఆర్థిక మందమనంతో ఆటో విక్రయాలు కూడా తగ్గిపోయాయి.

ఒక బ్రిటన్‌లో బ్రెగ్జిట్‌పై అనిశ్చితి వెంటాడింది. దీనితో జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ తన బ్రిటన్‌ ఫ్యాక్టరీలను వారం రోజులపాటు నవంబరునెలలోనేమూసివేస్తోంది. సరఫరా విఘాతం కలగడంతో బ్రెగ్జిట్‌పై స్పష్టతవచ్చేంతవరకూ కొనసాగించాలని తెలుస్తోంది. చైనా అమ్మకాలు గత ఏడాది 50శాతం క్షీణించాయి. 2019లో కొంతమెరుగుదల ఉందని, కొన్ని సమస్యలు సొంతంగా చేసిన అపరాధమేనని, వాహన నాణ్యత, డీలర్ల సమస్యలు కొన్ని వెంటాడాయని అన్నారు. ఆటోమొబైల్‌రంగం ఇపుడు సంక్లిష్ట సమయంలో ఉందన్నారు. ఇక విద్యుత్‌ వాహనాలు వస్తే తాము ఉత్పత్తి వ్యయం కూడా తగ్గించుకోగలుగుతామని అన్నారు. ఇపుడు పన్నులు సుంకాలపరంగా వివిధ దేశాలు కూడా కొంతమేర పరిరక్షణ విధానంతో నడుస్తున్నట్లు వెల్లడించారు. బ్రిటిష్‌బ్రాండ్లపై ఈ ఏడాది 3.9 బిలియన్‌ డాలర్లపెట్టుబడులు రద్దుచేసినట్లు వివరించారు. ఆటోమార్కెట్‌లో నెలకొన్న మందగమనమే ఇందుకుకీలకమని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న జెల్‌ఆర్‌పరిస్థితిని పూర్తిగా రివర్స్‌చేసి పునరుద్ధరించడమే తన లక్ష్యమని, 2021 నాటికి పూర్తిస్థాయిలో జెఎల్‌ఆర్‌ పునరుద్ధరణజరుగుతుందన్న ధీమా ఆయన వ్యక్తంచేసారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/