2021 నాటికి 700 ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం

మెట్రో స్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి స్థలాలో ఏర్పాటు చేస్తాం

tata-power-says-it-plans-to-have-700-ev-charging-stations
tata-power-says-it-plans-to-have-700-ev-charging-stations

న్యూఢిల్లీ: విద్యుత్‌ వాహన ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు టాటా పవర్‌ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణె నగరాల్లో ఇప్పటికే 100 ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన టాటా పవర్‌..2020, మార్చి కల్లా మరో 300 కేంద్రాలకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ప్రవీర్‌ సిన్హా మాట్లాడుతూ..మేము ఇప్పటివరకు ఈవీలను విడుదల చేసిన ప్రాంతాల్లో ఛార్జింగ్‌ కేంద్రాలను ఇన్‌స్టాల్‌ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. వేచ్చే ఏడాది కల్లా 700 ఈవీలను ఏర్పాటు చేయడమే మా లక్ష్యం అని తెలిపారు. మెట్రో స్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌, థియేటర్స్‌ వంటి ముఖ్యమైన స్థలాల్లో ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. కేవలం పబ్లిక్‌ స్థలాల్లోనే కాకుండా ఇంటి పరిసరాల్లోనూ ఈవీలను ఏర్పాటు చేయడమే మా లక్ష్యమని తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/