కనుమరుగవుతున్న ‘టాటానానో!

 Tata nano
Tata nano


న్యూఢిల్లీ: సామాన్యుని కారుగా పేర్కొంటూ టాటాగ్రూప్‌ఛైర్మన్‌ లక్ష రూపాయలకే కారు అని నానోకారును స్వయంగా నడుపుకుని వచ్చి ప్రారంభించిన మానసపుత్రిక ఉత్పత్తి ఇపుడు క్రమేపీ అడుగంటిపోతోంది. 2019 తొలి తొమ్మిదినెలల్లో అమ్మకాలను చూస్తే కేవలం ఒక్క కారుమాత్రమే అమ్ముడుపోయింది. ఇపుడు నానో ఉత్పత్తి వఙదానంచూస్తే భద్రతా నిబందనలు, బిఎస్‌-6 ఉద్దారాల నిబంధనలను అధిగమించలేదని తెలుస్తోంది. అయితే ఇప్పటికీ అధికారికంగా వాణిజ్య ఉత్పత్తిని నిలిపివేసినట్లుప్రకటించలేదు. అయితే దేశీయ మార్కెట్‌లో మాత్రం ఒకే ఒక్కటి అమ్మింది. డిమాండ్‌, ప్రస్తుతం ఉన్న నిల్వలు,సామర్ధ్యం, నైపుణ్యం వంటి వాటి ఆధారంగా మాత్రమే ఇక వెలికితీయాలని అంచనావేస్తోంది. నానో ముందు బిఎస్‌6 నిబంధనలకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుంది.కంపెనీ స్టాక్‌ఎక్ఛేంజిలకు ఇచ్చిన నివేదికనలు చూస్తే సెప్టెంబరువరకూ ఈ ఏడాది ఒక్క కారునుసైతం ఉత్పత్తిచేయలేదు. ఫిబ్రవరిలోమాత్రం ఒఏ ఒక్కకారును విక్రయించింది. మిగిలిన మాసాల్లో ఒక్క నానోను ఉత్పత్తిచేయనూలేదు, విక్రయించనూలేదు. 2008 జనవరిలో ఆవిష్కరించిన నానో ప్రజలకారుగా పేరుతెచ్చుకుంది. అయితే అమ్మకాలపరంగా ఆశించిన లక్ష్యాలు సాధించలేకపోయింది. 2018 జనవరి సెప్టెంబరుధ్యకాలంలో టాటామోటార్స్‌ 297 కార్లను ఉత్పత్తిచేస్తే 299 యూనిట్లు నానో దేశీయ మార్కెట్‌ అమ్మకాలున్నాయి. 2020 నుంచి నానో ఉత్పత్తిఅమ్మకాలు మొత్తం నిలిపివేయవచ్చన్న సంకేతాలిచ్చింది. 2009 మార్చిలో మార్కెట్‌కు విడుదలయిన నానోకారు లక్ష రూపాయలు బేసిక్‌మోటల్‌తో వచ్చింది. ఉత్పత్తి వ్యయం పెరుగుతుండటంతో టాటామోటార్స్‌ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేనిపరిస్థితి వచ్చింది. పశ్చిమబెంగాల్‌లోని సింగూరునుంచి గుజరాత్‌కు తరలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉత్పత్తి వ్యం పెరిగింది. టాటామోటార్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌మిస్త్రీని తొలగించినట్లుగానే ఈకారును కూడా మార్కెట్‌నుంచి తొలగించక తప్పదని అంచనా. నానోవల్ల వెయ్యికోట్ల వరకూ నష్టం ఎదుర్కొనవచ్చన్న అంచనాలతో కంపెనీ ఇపుడిపుడే ఉత్పత్తిని అమ్మకాలను తగ్గించుకుంటూ వస్తోంది. అయితే సెంటిమెంట్‌ఫరంగా ఉత్పత్తిని మాత్రం నిలిపివేయలేకపోతోంది,.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/