ధరలను భారీగా పెంచిన టాటా మోటార్స్

tata motors
tata motors

న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతూ టాటా మోటార్స్ నిర్ణయం తీసుకుంది. అన్ని మోడళ్లపైనా రూ. 40 వేల వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇంధన ధరల పెరుగుదల, ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో ధరలను పెంచక తప్పలేదని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల వ్యాపార విభాగ అధ్యక్షుడు మయాంక్ పారిక్ తెలిపారు.