టాటా ఎలిక్సీ షేర్లు జోష్‌

8శాతానికి పైగా లాభం

TATA ELXSI-
TATA ELXSI-

ముంబై: గత 6 నెలలుగా ఫుల్‌జోష్‌లో ఉన్న టాటా ఎలిక్సీ సోమవారం మరోసారి డిమాండ్‌ పెరిగింది. మూడో త్రైమాసికంలో ఎఫ్‌పిఐ వాటా పెరగడంతో ఇంట్రాడేలో 8శాతానికిపైగా లాభపడి రూ.2539కి చేరింది. ఇది ఏడాది గరిష్టానికి చేరువలో ఉంది.

ఈ ఏడాది జనవరి 14న కంపెనీ ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయి రూ.2576కు చేరింది. గత నెల రోజుల్లో ఈ షేరు 55శాతం పెరిగింది. ప్రస్తుతం 6.50శాతానికిపైగా లాభంతో రూ.5213వద్ద షేరు ట్రేడవుతోంది. డిసెంబరు 31తో ముగిసిన త్రైమాసికంలో టాటా ఎలిక్సీలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమ వాటాను పెంచుకున్నారు.

డిసెంబర్‌ త్రైమాసికంలో ఎఫ్‌పిఐలు వాటా 2.08శాతం పెరిగింది. ఇక గత వారం ప్రకటించిన ఆర్థికఫలితాల్లో ఈ సంస్థ రెండంకెల వృద్ధిని సాధించింది.

మొత్తం సంస్థ ఆదాయం 10.9శాతం వృద్ధితో రూ.477కోట్లుగా నమోదు కాగా, కంపెనీ నికర లాభం 33.5శాతం వృద్ధితో రూ.105కోట్లకు పెరిగింది. ఎబిటా మార్జిన్‌ 300 బేసిస్‌ పాయింట్లు పెరిగి 27.8శాతానికి చేరింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/