టాటా ఎలిక్సీ ఆల్‌టైమ్ గరిష్టం
మూడవ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు రెండంకెల వృద్ధి
Mumbai డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు స్ట్రాంగ్‌గా ఉండడంతో గురువారం టాటా ఎలాక్సీ స్ట్రాంగ్ గా ట్రేడవుతోంది. ఇంట్రాడేలో ఈ షేరు 11శాతానికిపైగా లాభపడి డే గరిష్టస్థాయి రూ.2300కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్టస్థాయి కావడం విశేషం.
ప్రస్తుతం 8.5శాతం లాభంతో 2264 రూపాయల వద్ద షేరు ట్రేడవుతోంది. ఎన్ఎస్ఇలో ఇప్పటి వరకు 22.75లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ఈ ఆర్థిక సంవత్స రం మూడవ త్రైమాసికంలో టాటా ఎలాక్సీ ఆర్థిక ఫలితాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి.
కంపెనీ మొత్తం ఆదాయం 10.9శాతం వృద్ధితో రూ.477కోట్లకు చేరింది. ట్రాన్సపోర్ట్, బ్రాడ్కాస్ట్, కమ్యూనికేషన్, హెల్త్‌కేర్ రంగాల్లో ఈ కంపెనీ చక్కని ప్రదర్శనను నమోదు చేసింది. ఎబిటా మార్జిన్ 300 బేసిస్ పాయింట్లు పెరిగి 27.8 శాతానికి చేరింది. ఇక కంపెనీ నికర లాభం 33.3 శాతం వృద్ధితో 105 కోట్ల రూపా యలుగా నమోదైంది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/