టాటా ఎలిక్సీ ఆల్‌టైమ్‌ గరిష్టం

మూడవ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు రెండంకెల వృద్ధి

Tata Elsxi Alltime Max
Tata Elsxi Alltime Max


Mumbai డిసెంబర్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు స్ట్రాంగ్‌గా ఉండడంతో గురువారం టాటా ఎలాక్సీ స్ట్రాంగ్‌ గా ట్రేడవుతోంది. ఇంట్రాడేలో ఈ షేరు 11శాతానికిపైగా లాభపడి డే గరిష్టస్థాయి రూ.2300కు చేరింది. ఇది ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయి కావడం విశేషం.

ప్రస్తుతం 8.5శాతం లాభంతో 2264 రూపాయల వద్ద షేరు ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఇలో ఇప్పటి వరకు 22.75లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ఈ ఆర్థిక సంవత్స రం మూడవ త్రైమాసికంలో టాటా ఎలాక్సీ ఆర్థిక ఫలితాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి.

కంపెనీ మొత్తం ఆదాయం 10.9శాతం వృద్ధితో రూ.477కోట్లకు చేరింది. ట్రాన్సపోర్ట్‌, బ్రాడ్‌కాస్ట్‌, కమ్యూనికేషన్‌, హెల్త్‌కేర్‌ రంగాల్లో ఈ కంపెనీ చక్కని ప్రదర్శనను నమోదు చేసింది. ఎబిటా మార్జిన్‌ 300 బేసిస్‌ పాయింట్లు పెరిగి 27.8 శాతానికి చేరింది. ఇక కంపెనీ నికర లాభం 33.3 శాతం వృద్ధితో 105 కోట్ల రూపా యలుగా నమోదైంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/