బెండతో బోలెడు!

రుచి: వెరైటీ వంటకాలు

Taste-Variety of dishes
Taste-Variety of dishes

బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా..అని సామెత బ్రహ్మచారి సంగతేమో కానీ..
బెండకాయను మాత్రం లేతగా ఉండగానే వండాలి దీనిలో ఎ,బి,సి విటమిన్లు పలు పోషకాలతోపాటు అయోడిన్‌ కూడా ఉండటం వల్ల అనేక వ్యాధులను దరిచేరనివ్వదు అన్నట్లు ఓపిక ఉండి వండాలేకాని బెండతో రకరకాల వెరయిటీలు చెయ్యొచ్చు.రుచి చూశారంటే బెండర్‌ఫుల్‌ అనాల్సిందే.

బెండకాయ 65

కావలసిన పదార్థాలు :
అల్లం- చిన్న ముక్క, పిచ్చిమిర్చి – 4, వెల్లుల్లి రెబ్బలు -4, బెండకాయలు – అరకిలో, సెనగపిండి-పావుకప్పు, బియ్యప్పిండి-పావుకప్పు, జీలకర్ర పొడి- ఒక టీస్పూను, మిరప కారం – ఒక టీ స్పూను, ఉప్పు- తగినంత, పల్లీలు-పావు కప్పు, గరం మసాలా – అరటీ స్పూను, పచ్చి కొబ్బరి – పావు కప్పు.

తయారు చేయు విధానం :
అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి బెండకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి పూర్తిగాపోయాక చిన్న చిన్న ముక్కలుగా తరగాలి.

ఒక ప్లేటులో బెండకాయ ముక్కలు, సెనగ పిండి, బియ్యంపిండి, జీలకర్ర పొడి, మిరపకారం, కొద్దిగా నీళ్లు వేసి కలపాలి. స్టౌ మీద బాణలిలో నూనెకాగాక పల్లీలు వేసి డీప్‌ ప్రైచేసి పక్కన ఉంచాలి.

అదే నూనెలో కరివేపాకు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి అదే నూనె మరోసారి కాగాక బెండకాయ ముక్కలను పకోడీలుగా వేసి, మంట మీద సుమారు పావు గంట సేపు వేయించి దింపాలి. గరం మసాలా, వేయించి ఉంచిన పల్లీలు, పచ్చి కొబ్బరి తురుము ఒకదాని తరవాత ఒకటి వేసి బాగా కలపాలి.

స్టఫ్ట్‌ బెండకాయ ఫ్రె

కావలసిన పదార్థాలు :
బెండకాయలు – పావు కేజీ, పల్లీలు – 100 గ్రా, (వేయించి పొట్టు తీసేయాలి), ఉప్పు తగినంత , నూనె-4 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర- ఒక టేబుల్‌ స్పూన్‌, ధనియాలు – ఒక టేబుల్‌ స్పూన్‌, పచ్చి సెనగపప్పు- ఒక టేబుల్‌ స్పూన్‌, మినపప్పు- ఒక టేబుల్‌ స్పూన్‌, నువ్వులు – ఒక టేబుల్‌ స్పూన్‌, ఎండుమిర్చి – 10, పసుపు కొద్దిగా.

తయారు చేయు విధానం :
స్టౌ మీద మణలినూనె వేడయ్యాక సెనగపప్పు, మినపప్పు వేసి దోరగా వేయించాలి జీలకర్ర, ధనియాలు జతేసి మరోమారు వేయించాలి.

నువ్వులు కూడా వేసి బాగా కలపాలి ఎండుమిర్చి వెల్లుల్లి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించి, మంట ఆపేయాలి. పల్లీలు జత చేసి కలపాలి. బాగా చల్లారాక ఉప్పు, పసుపు జతచేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి

బెండ కాయ తొడిమలు తీసేసి, పొడవునా ఒక వైపు చీల్చాలి తాయరు చేసిన మసాలా మిశ్రమాన్ని స్టఫ్‌ చేయాలి. స్టౌ మీద బాణలిలో నూనెవేసి కాగాక స్టఫ్‌ చేసిన బెండకాయలు వేసి వేయించాలి. కొద్ది సేపటి తర్వాత మూత ఉంచి మీడియ మంట లో మగ్గనిచ్చి దింపేయాలి.

బెండకాయ పులుసు

కావలసినవి : బెండకాయ ముక్కలు – పావుకేజీ ఉల్లీ తరుగు – కప్పు, టొమాటో తరుగు – కప్పు, పచ్చిమిర్చి – 3, నూనె-3 టేబుల్‌ స్పూన్లు, కరివేపాకు – 2 రెమ్మలు, కొత్తిమీర-కొద్దిగా, పసుపు చిటికెడు, మిరపకారం-2 టీ స్పూన్లు, ఉప్పు-తగినంత, వేయించిన దనియాల పొడి – ఒక టీ స్పూన్‌, ఎండుకొబ్బరి పొడి – ఒక టేబుల్‌ స్పూను, చింతపండు రసం – అరకప్పు, ఆవాలు – ఒక టీ స్పూను, జీలకర్ర – ఒక టీస్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద – ఒక టీస్పూను.

తయారు చేయు విధానం :
స్టౌమీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. పచ్చిమిర్చి, ఉల్లి తరుగు జతచేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద జతచేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి మూత ఉంచాలి.

ఒక గిన్నెలో టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి మెత్తగా అయ్యేవరకు చేతితో బాగా కలపాలి. చింతపండు రసం కూడా జతచేసి మరోసారి కలపాలి.

ఉల్లి తరుగు బంగారు రంగులోకి వచ్చాక కరివేపాకు జత చేయాలి .కలిపి ఉంచుకున్న టొమాటో, చింతపండు రసం జత చేసి మూతపెట్ట, సన్నటి మంట మీద నాలుగు నిమిషాలు ఉడికించాలి. –

బెంకాయ ముక్కలు జత చేసి కలపాలి . రెండు కప్పుల నీళ్లు జతచేసి, మూత ఉంచి ఏడు నిమిషాలు మరగనివ్వాలి.

ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి కలపాలి w కొత్తిమీర జతచేసి, మరో ఐదు నిమిసాలు ఉడికించి దింపేయాలి.

బెండకాయ మసాలా కర్రీ

కావలసిన పదార్థాలు :
నూనె-2 టేబుల్‌ స్పూన్లు, బెండకాయలు – పావుకిలో, జీలకర్ర- ఒకటీ స్పూన్‌, ఉల్లి తరుగు-పావు కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్‌, పసుపు – కొద్దిగా, మారపకారం -2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్‌, ధనియాల పొడి – ఒక టీస్పూన్‌ గరం మసాలా అరటీ స్పూన్‌, ఉప్పు- తగినంత, టొమాటో తరుగు – పావుకప్పు, పెరుగు – 2 టేబుల్‌ స్పూన్లు.

తయారు చేయు విధానం :
బెండకాయలను శుభ్రంగా కడిగి తడిపోయే వరకు ఆరబెట్టాక పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి . స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, బెండకాయ ముక్కలు వేసి బాగా వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి.

అదే బాణలలో జీలకర్ర వేసి కొద్దిగా వేగాక ఉల్లి తరుగు వేసి కద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద జతచేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి.

పసుపు మారపకారం, జీలకర్ర పొడి, ధనియాలపొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. టొమాటో తరుగు జత చేసి, బాగా కలిపి మెత్తబడేవరకు ఉడికించాలి. పెరుగు జత చేసి, కలియబెట్టి, కొద్దిసేపు మూత ఉంచాలి .

బెండకాయ ముక్కలు జతచేసి, ముక్కలకు మసా లా పట్టే వరకు మీడియం మంట మీద ఉడికించి, కొద్దిగా నీళ్లు జత చేసి మరి కాసేపు ఉడికించాలి. కొత్తిమీరతో అలంకరించి దింపేయాలి.

బెండకాయ రైస్‌

కావలసిన పదార్థాలు :
బెండకాయ ముక్కలు – పావుకేజీ,
ఎండు కొబ్బరి – పావు కప్పు, పుట్నాల పప్పు-అరకప్పు, కారం – 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు-తగినంత, పల్లీలు-పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు-6, ఆవాలు-ఒక టీస్పూన్‌, జీలకర్ర – ఒక టీ స్పూన్‌, పచ్చి సెనగపప్పు, మినపప్పు- ఒక టీ స్పూన్‌, ఎండుమిర్చి – 3,
పచ్చి మిర్చి – 4, కరివేపాకు -2, రెమ్మలు, నూనె – 4 టేబుల్‌ స్పూన్లు,
అన్న పావుకేజీ బియ్యం ఉడికించాలి.

తయారు చేయు విధానం :
మిక్సీలో ఎండుకొబ్బరి, పుట్నాల పప్పు, ఉప్పు కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పొడి చేయాలి. స్టౌమీద బాణలిలో నూనెకాగాక బెండకాయ ముక్కలు వేసి వేయించి, మూత ఉంచాలి.

రెండు నిమిషాల తర్వాత మూత తీసి, చిటికెడు ఉప్పు జత చేసి ముక్కలు బాగా మెత్తబడే వరకు వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి.

అదే బాణలిలో పల్లీలు వేసి వేయించాలి. wఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపువేసి వేయించాలి.

పుట్నాలకారం జతచేసి అన్నీ కలిసే వరకు బాగా కలపాలి వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు జతచేసి బాగా కలిపి, మూడు నిమిషాల తరువాత దింపేయాలి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/