పోషకాల రాజ్మాతో వెరైటీలు
రుచి: వంటకాలు

రాజ్మా సూప్
కావలసిన పదార్థాలు: రాజ్మా గింజలు -ఒక కప్పు, సన్నగా తరిగిన ఉల్లిముక్కలు -పావుకప్పు,పచ్చిమిర్చి తరుగు-ఒక టేబుల్ స్పూన్,వెల్లుల్లి పేస్ట్-ఒక టీ స్పూన్, టమాటా పేస్ట్- పావు కప్పు,నూనె- రెండు టీ స్పూన్లు,ఉప్పు- తగినంత
తయారు చేసే విధానం:
రాజ్మా గింజలను 6 గంటల పాటు నానబెట్టండి. తర్వాత తగినన్ని నీళ్లు జతచేసి ప్రెషర్ కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి.
ఉడికిన రాజ్మాను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయండి. ఒక గిన్నెలో నూనె వేడిచేసి ఉల్లిముక్కలు, పచ్చిమిచ్చి తరుగు, వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించండి. రెండు నిమిషాల తర్వాత టమాటా పేస్ట్ కలపండి. టమాటా పచ్చివాసన పోయాక రాజ్మాపేస్ట్, ఉప్పు కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించండి. సూప్ వడ్డించినప్పుడు పైన కొద్దిగా తరిగిన చీజ్ లేదాక్రీమ్ వేసి సర్వ్ చేయవచ్చు
కావలసిన పదార్థాలు:
ఉడికించిన రాజ్మా-ఒక కప్పు, ఉడికించిన బంగాళాదుంప-చిన్నది,కార్న్ ఫ్లోర్- రెండు టీ స్పూన్లు,
పచ్చిమిర్చి తరుగు- ఒక టేబుల్ స్పూన్, చాట్ మసాలా- 1/2టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టీ స్పూన్, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- తగినంత.
తయారుచేసే విధానం:
ఉడికించిన రాజ్మా, బంగాళదుంపు మెదిపి ముద్దగా చేసి రెండూ కలపండి. ఈ మిశ్రమానికి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, చాట్ మసాలా, కార్న్‌ఫ్లోర్ కలిపి చిన్నచిన్న టిక్కీలుగా చేయండి. పెనంలో కొద్దిగా నూనె వేసి టిక్కీలు ఒకదాని పక్కనొకటి ఉంచి రెండు వైపులా కాల్చండి.
వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే టమాటా సాస్‌తో గానీ స్వీట్ చట్నీతో గానీ తీసుకుంటే బాగుంటుంది. టిక్కీలు పెనంపై కాకుండా డీప్‌ప్రై కూడా చేసుకోవచ్చు. లేదా, ఒవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/