పనస వడలు

రుచి: కొత్త వంటకాలు

Taste-New recipes- jackfruit vadalu
Taste-New recipes- jackfruit vadalu

కావాల్సిన పదార్ధాలు:

పనస గింజలు-2, బియ్యం పిండి-ఒక కప్పు, పచ్చి మిర్చి – 4, పచ్చి కొబ్బరి తురుము- ఒక కప్పు, ఉల్లి తరుగు – అర కప్పు, జీల కర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు- రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు- పావు కప్పు, అల్లం తరుగు – ఒక టేబుల్ స్పూన్, నూనె – వేగించటాకిని సరిపడా..

తయారు చేసే విధానం:

గింజలపై పొత్తు తీసి కుక్కర్ లో ఉడికించాలి. మిక్సీలో చల్లారిన పనస గింజలు, అల్లం, కొబ్బరి తురుము, పచ్చి మిర్చి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అందులో ఉప్పు, కొత్తిమీర వేసి పేస్ట్ బియ్యంపిండి, జీల కర్ర వేసి బాగా కలిపి ముద్దగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంత కొంత తీసుకుని వదులుగా ఒత్తి కాలిన నూనెలో దోరగా రెండువైపులా వేగించాలి. ఇష్టమైన వారు ఇదే మిశ్రమాన్ని పకోడీగా కూడా వేసుకోవచ్చు.

‘స్వస్థ’ (ఆరోగ్య సంబంధిత విషయాలు) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health/