అత్యంత విష‌మంగా త‌రుణ్ గొగోయ్ ఆరోగ్యం

Tarun-Gogoi

గువాహటి: అసోం మాజీ సిఎం తరుణ్‌ గొగోయ్ ఆరోగ్యం సోమవారం మరింత క్షీణించింది. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని గువాహటి మోడికల్‌ కాలేజీ ఆసుపత్రి(జీఎంసీహచ్‌) సూపరిండెట్‌ అభిజిత్‌ శర్మ వెల్లడించారు. ఈ ఉద‌యం త‌రుణ గొగోయ్ ఆరోగ్య ప‌రిస్థితి ప‌రిశీలించాం. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం అత్యంత విష‌మంగా ఉన్న‌ది. మేం ఇవాళ ఆయ‌న‌కు డయాల‌సిస్ నిర్వ‌హించాల‌ని భావించాం. కానీ ఆయ‌న‌ ఆరోగ్య ప‌రిస్థితి అందుకు స‌హ‌క‌రించేలా లేక‌పోవ‌డంతో మానుకున్నాం. నిన్న‌టితో పోల్చితే ఇవాళ ఆయ‌న ఆరోగ్యం మ‌రింత విష‌మంగా ఉంది అని అభిజీత్ శ‌ర్మ తెలిపారు.

త‌రుణ్ గొగోయ్ క‌రోనా బారిన ప‌డ‌టంతో గ‌త నెల‌లో గువాహ‌టి మెడిక‌ల్ కాలేజ్ & ఆస్ప‌త్రిలో చేరారు. అప్ప‌టి నుంచి అక్క‌డే చికిత్స పొందుతున్న ఆయ‌న ఆరోగ్యం శ‌నివారం ఒక్కసారిగా విష‌మించింది. శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డుతుండ‌టంతో శ‌నివారం నుంచి ఆయ‌న‌ను వెంటిలేట‌ర్‌పై ఉంచారు. ఆదివారం కొద్దిగా కోలుకున్న‌ట్లే క‌నిపించినా ఇవాళ ప‌రిస్థితి మ‌రింత విష‌మించింద‌ని వైద్యులు తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/