TSPSC పేపర్ లీక్ ఫై బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ కామెంట్స్

TSPSC పేపర్ లీక్ ఫై బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. ఈ ఘటన ఫై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారంపై హైదరాబాద్ గన్ పార్క్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న బండి సంజయ్ ను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానని, అలాగే బీజేపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని సైతం ఖండిస్తున్నట్లు తరుణ్ చుగ్ అన్నారు.

మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని , లాఠీఛార్జీలో పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత వల్ల ఉద్యోగాల కోసం చూస్తున్న వేలాది మంది భవిష్యత్తు నాశనమయిందని ఈ సందర్బంగా తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్ మోసాన్ని ప్రజల ముందు బీజేపీ నగ్నంగా బయటపెడుతుందని అన్నారు. కేసీఆర్ కుటుంబం భారీ మూల్యం చెల్లించుకునే రోజు ఎంతో దూరం లేదని అన్నారు.