మెరుగైన వైద్యం కోసం తారకరత్నను విదేశాలకు తరలిస్తున్నారా..?

మెరుగైన వైద్యం కోసం తారకరత్నను విదేశాలకు తరలిస్తున్నారా..? ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో ఇదే మాట్లాడుకుంటున్నారు. వారం క్రితం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆయన్ను కుప్పం లోని హాస్పటల్ కు తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్ కు తరలించారు. గత వారం రోజులుగా డాక్టర్స్ తారకరత్న కు చికిత్స అందిస్తూనే ఉన్నారు. కానీ ఇంకా మెరుగుపలేదు. రోజు రోజుకు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుంది. దీంతో ఇక్కడైతే కుదరదని..వెంటనే తారకరత్న ను విదేశాలకు తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందించాలని భావిస్తున్నారట.

ప్రస్తుతం నందమూరి కుటుంబం మొత్తం హాస్పటల్ లోనే ఉంటోన్నారు. తారకరత్న తండ్రి మోహన కృష్ణ, బాబాయ్ బాలకృష్ణ, వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. తారక్ కు అందుతోన్న వైద్య సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్నారు. మరోపక్క టీడీపీ నేతలు ఎవరొకరు వస్తూ తారకరత్న ఆరోగ్యం ఫై ఆరా తీస్తూనే ఉన్నారు. మెదడు సంబంధిత ఇబ్బందులకు గురైన తారకరత్నకు మరింత మెరుగైన చికిత్సను అందించడానికి ఏర్పాట్లు చేస్తోన్నట్లు హిందూపురం టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన మెదడుకు స్కాన్‌ తీశారని, రిపోర్టులను బట్టి విదేశాలకు తీసుకెళ్లాలనే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారని అన్నారు. మెదడులో నీరు చేరిందని, కొద్దిగా వాపు కనిపించిందని చెప్పుకొచ్చారు.