పరిటాల వర్ధంతి కార్యక్రమంలో నందమూరి తారకరత్న

టీడీపీ నేత , పరిటాల రవీంద్ర 18వ వర్ధంతి కార్యక్రమంలో సినీ నటుడు , టీడీపీ నేత నందమూరి తారకరత్న హాజరయ్యారు. మంగళవారం ఉదయం అనంతపురం జిల్లా వెంకటాపురంలో రవీంద్ర ఘాట్‌ వద్ద పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ్, ఇతర కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పరిటాల అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

‘జోహార్ పరిటాల రవీంద్ర’, ‘పరిటాల రవీంద్ర ఆశయాలు సాధిస్తాం’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇక కార్య క్రమానికి హాజరైన తారకరత్న కు వెంకటాపురంలో నాయకులు ఘన స్వాగతం పలికారు. తర్వాత రవీంద్ర ఘాట్ దగ్గర తారకరత్న నివాళులు అర్పించారు. పరిటాల శ్రీరామ్, సిద్ధార్థ్, ఇతర కుటుంబ సభ్యులతో తదితరులతో ఈ సందర్భంగా తారకరత్న మాట్లాడారు. తారకరత్నను చూసేందుకు వచ్చిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగారు.