ఈరోజు ఈడీ ముందుకు నటుడు తనీష్

డ్రగ్స్ కొనుగోళ్లు… మనీ లాండరింగ్ కేసుల నేపథ్యంలో ఈడీ అధికారులు ఈరోజు నటుడు తనీష్ ను విచారించబోతున్నారు. ఉదయం 10 గంటలకు తనీష్ ఈడీ ఆఫీస్ కు రానున్నారు. 2017లో ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా తనీష్ ను అధికారులు విచారణ చేయబోతున్నారు. కెల్విన్ తనీష్ కి మధ్య జరిగిన ఆర్థికలావదేవిలపై స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. అలాగే డ్రగ్స్ హబ్ గా మారిన ఎఫ్ లాంజ్ పబ్ వివరాలు ఏమన్నా తెలుసా ? అన్న కోణంలో తనీష్ ని ఈడీ విచారించబోతోంది.

ఇప్పటివరకు చిత్రసీమ నుండి దర్శకుడు పూరీ జగన్నాథ్‌, ఛార్మి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నటులు రాణా, నందు, రవితేజ, నవదీప్​, ఎఫ్​ క్లబ్​ జనరల్​ మేనేజర్​తో పాటు మత్తు మందు సరఫరాదారులు కెల్విన్‌, వాహిద్‌, ముమైత్ ఖాన్ లను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి వారి ఖాతాల్లో అనుమానాస్పదంగా ఉన్న లావాదేవీలపై అడిగి తెలుసుకున్నారు.