ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫై మంత్రి వనిత కామెంట్స్

గోరంట్ల మాధవ్ గా ప్రచారం అవుతున్న న్యూడ్ వీడియో ఫై ఏపీ హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. ఎంపీ మాధవ్ కు చెందినదిగా ప్రచారం అవుతున్న వీడియోలో.. రాజకీయ కుట్ర ఉందని అనుమానం కలుగుతోందని వనిత అన్నారు. ఇదే విషయాన్ని మాధవ్ కూడా చెప్పారని .. తన వీడియోను మార్ఫింగ్ చేశారని.. ఎంపీ మాధవ్ ఫిర్యాదు చేసిన విషయాన్ని వనిత గుర్తు చేశారు.

మంగళవారం మంత్రి వనిత మీడియాతో మాట్లాడుతూ.. వీడియో మార్ఫింగ్‌ అని ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. దీంతో, గోరంట్ల మాధవ్‌ వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాము. తప్పు చేస్తే ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకుంటాము. ఇది రాజకీయ కుట్రలా ఉందనే అనుమానాలు ఉన్నాయి. కుట్రకు పాల్పడితే ఎవరినీ వదలేది లేదు. టీడీపీ హయంలో మహిళలపై ఎన్నో దారుణాలు జరిగాయి. కొందరు పెయిడ్‌ ఆర్టిస్టులు ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంలో ఎంపీ మాధవ్ ను ప్రభుత్వం రక్షించాలని చూస్తోందంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మాధవ్‌ను ప్రభుత్వం రక్షించడం లేదని స్పష్టంగా చెప్పామని.. ఫోరెన్సిక్ నివేదిక తర్వాత అన్ని విషయాలూ తెలుస్తాయని అన్నారు. మహిళలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పిన హోం మంత్రి.. “దిశ” యాప్ ద్వారా రాష్ట్రంలో 900 మహిళలను రక్షించామని తెలిపారు.

అయితే.. మాధవ్ కు సంబంధించినది చెబుతున్న వీడియోగా.. ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్ విచారణలో ఉందని తెలిపారు. నిపుణులు పర్యవేక్షిస్తున్నారని.. త్వరలోనే ఫోరెన్సిక్ నివేదిక వస్తుందని చెప్పారు. ఆ వీడియో నిజమైనదే అని తేలితే.. తప్పకుండా శిక్ష పడుతుందని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి వనిత అన్నారు.

ఇక, ఈ వ్యవహారంలో ఎంపీ మాధవ్ ను ప్రభు