తెలుగువారి కోసం ‘తానా’ ‘టెలి హెల్త్ ప్లాట్ ఫామ్’

బోర్డ్ సర్టిఫైడ్ వైద్య నిపుణులతో వినూత్న సేవా కార్యక్రమం

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజానీకం అందరికీ అందుబాటులో ఉండేలా ‘తానా’ (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ) మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా.. పలు ఆరోగ్య సంబంధిత సమస్యల పరిష్కారానికి సలహాలు, సూచనలను అమెరికా, యూ కే మరియు ఇండియా లో పేరుగాంచిన ప్రముఖ వైద్యులతో ప్రతి ఆదివారం ఉదయం 9గంటల నుంచి 11 గంటల వరకు (EST) ) ( ఇండియా సమయం సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు (IST)) జూమ్ కాల్ నిర్వహిస్తారు.

కుటుంబ ఆరోగ్యం, ఇంటర్నల్ మెడిసిన్ , కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, సైకాలజీ , క్రిటికల్ కేర్ , పెడియాట్రిక్స్,నెర్వ్ క్రిటికల్ , స్లీప్ మెడిసిన్ కి సంబంధించి ప్రముఖ వైద్యులు సలహాలు, సూచనలు అందిస్తారు.

ఈ అవకాశాన్నిఉపయోగించుకునే వారు https://www.eglobaldoctors.com లో తమ వివరాలతో పాటు కావాల్సిన సర్వీస్ నమోదు చేయించుకోగలరని ప్రకటన చేశారు

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/