‘దిశ’కు నివాళులర్పించిన తానా

tana
tana

న్యూయార్క్‌: న్యూయార్క్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో ‘దిశ’కు నివాళి అర్పించే కార్యక్రమం జరిగింది. ఇలాంటి అమానుషమైన చర్యలను తానా తీవ్రంగా ఖండిస్తోందని తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి అన్నారు. షాద్‌ నగర్‌ లో ‘దిశ’ పై జరిగిన అమానుష దాడి యావత్‌ దేశంతో పాటు విదేశాల్లో ఉంటున్న తమనందరినీ ఎంతో కలచి వేసిందని ఈ అమానుష చర్య సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని జే తాళ్లూరి ఆందోళన వ్యక్తం చేసారు. మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చట్టాలలో సత్వరమే మార్పులు తీసుకువచ్చి బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసారు. ‘దిశ’ మరణానికి తమ సంతాపాన్ని తెలుపుతూ ‘దిశ’ కుటుంబానికి ”తానా”సంస్థ, నాయకత్వం తరఫున తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నామన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/