టిడిపిపై ఏపి స్పీకర్‌ విమర్శలు

టిడిపి తీరు కారణంగా పేదవారికి అందించే పెన్షన్లు సైతం ఆగిపోయాయి..

Tammineni Sitaram
Tammineni Sitaram

అమరావతి: ఏపి స్పీకర్‌ తమ్మినేని సీతారాం టిడిపిపై మరోసారి మండిపడ్డారు. శాసనమండలిలో టిడిపి ఆర్థిక బిల్లును అడ్డుకోవడం వల్లే నేడు ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. పేదవారికి అందించే పెన్షన్లు సైతం ఆగిపోయాయని తమ్మినేని సీతారాం టిడిపి తీరును తప్పుబట్టారు.ఈ కారణంగానే ఏపి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించలేకపోతోందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఆర్థిక బిల్లును అడ్డుకున్న ఘటనలు ఎక్కడా జరగలేదని తమ్మినేని సీతారాం అన్నారు. ప్రతిపక్షాలు ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాత్మక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. 108,104 వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా విమర్శించడం సమంజసం కాదని తెలిపారు. ప్రజల సంక్షేమంలో వైఎస్ ఒక్క అడుగు ముందుకు వేస్తే…. జగన్ 10 అడుగులు ముందుకు వేస్తున్నారని కొనియాడారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/