నాగబాబు కు కౌంటర్ ఇచ్చిన తమ్మారెడ్డి

చిత్రసీమలో ఆర్ఆర్ఆర్ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఉండడం తో అంత ఈ సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి ఆర్ఆర్ఆర్ ఫై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఖర్చులు రూ.80 కోట్లు అని, ఆ డబ్బు తమకిస్తే 8 సినిమాలు తీసి మీ ముఖాన కొడతాం అని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో తమ్మారెడ్డి అన్నారు. దీంతో చాలామంది తమ్మారెడ్డి ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాగబాబు సైతం కాస్త ఘాటుగానే ఫైర్ అయ్యారు. “నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం” (#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం) అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై తమ్మారెడ్డి రియాక్ట్ అయ్యారు. తాను ఏ తప్పు చేయలేదని.. క్షమాపణ చెప్పనన్నారు. చిన్న సినిమాలపై తాను మూడు గంటల సేపు మాట్లాడితే.. కేవలం ఓ క్లిప్పింగ్​ ఆధారంగా తనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజమౌళిని చూసి తాను జెలసీ ఫీలవుతున్నానని కొందరు అంటున్నారని.. ఆయన తనకు సమకాలీకుడు కాదంటూ నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏదో కృష్ణా, రామా అంటూ బతుకుతున్నానని చెప్పారు. రెండ్రోజుల కింద ‘ఆర్ఆర్ఆర్’ను ప్రశంసిస్తూ మాట్లాడానని.. దాని గురించి ఎవరూ పట్టించుకోరన్నారు.

నీయమ్మ మొగుడని ఒకరు నన్ను అన్నారు. నా అమ్మ మొగుడు నాకు సంస్కారం నేర్పించాడు. నాకు నీతిగా బతకడం, నిజం చెప్పడం నేర్పించాడు. మీకు నేర్పించారా? మీకు నిజం తెలుసా? నిజం చెప్పగలరా మీరు? మీరు చేసిన నిజాలేంటో చెప్తారా? మీకు హక్కుందా నా గురించి మాట్లాడటానికి?’ అని తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు. తనను తిట్టిన వారికి సిగ్గుండాలని ఆయన అన్నారు. ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే తిరిగి మొహం మీదే పడుతుందంటూ తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు.

అసలు వీడికేం లెక్కలు తెలుసంటున్నారు కొందరు. నాకు లెక్కలు తెలియనక్కర్లేదు. అయితే చాలా మంది అకౌంట్స్ నాకు తెలుసు. ఎవరెవరు ఏ అవార్డులు, పదవుల కోసం ఎవరెవరిని ఏమేం అడుక్కున్నారో, ఎవరెవరి కాళ్లు పట్టారో అన్నీ నాకు తెలుసు. నేనెప్పుడూ వీటి గురించి మాట్లాడను. నేను మాట్లాడితే ఇండస్ట్రీ పరువు పోతుంది. ఇండస్ట్రీ నా తల్లి. ఇండస్ట్రీని గౌరవిస్తా. అందుకే ఈరోజుకీ సంయమనంగానే మాట్లాడుతున్నా’’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.