తమిళనాడులో లాక్‌డౌన్‌ పొడిగింపు

డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు లాక్‌డౌన్‌ అమలు

Tamil Nadu government extends lockdown

చెన్నై: కరోనా మహమ్మారి కేసులు అధికంగా పెరుగుతుండడంతో త‌మిళ‌నాడులో డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడ‌గించారు. అయితే కొన్ని ఆంక్ష‌ల‌ను స‌డ‌లించారు. బీచ్‌ల‌ను ప‌బ్లిక్‌కు ఓపెన్ చేశారు. యూజీ, పీజీ కాలేజీల‌ను తెరిచేందుకు అనుమ‌తి ఇచ్చారు. రాజ‌కీయ స‌మావేశాలు నిర్వ‌హించేందుకు కూడా కొన్ని స‌డ‌లింపులు ఇచ్చారు. కోవిడ్ నియ‌మావ‌ళి పాటించాల్సి ఉంటుంది. ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా మాస్క్‌లు ధ‌రించాల్సి ఉంటుంది. క్రీడా శిక్ష‌ణ కోసం స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమ‌తి ఇచ్చారు. డిసెంబ‌ర్ 14 నుంచి మెరీనా బీచ్‌ను విజిట్ చేసేందుకు అనుమ‌తి క‌ల్పించారు. ప్ర‌స్తుతం చెన్నైలో కోవిడ్ కేసులు త‌గ్గుతున్నాయి. దీంతో అక్కడి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఖాళీ బెడ్స్ సంఖ్య పెరుగుతోంది. అయినా ప్ర‌భుత్వం మాత్రం క‌ఠిన ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్న‌ది.


తాజా ఏపి వార్తం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/