అశ్వాపురం లో గవర్నర్ కు నిరసన సెగ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న గవర్నర్ తమిళ సై కి నిరసన సెగ ఎదురైంది. అశ్వాపురం ఎస్కేటీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసరాలు, దప్పట్లతో పాటు హెల్త్ కిట్లు పంపిణీ చేశారు. హాల్ ఉన్న పునరావాస కేంద్రంనికి ఆమె చేరుకొని.. వరద బాధితులకు, చిన్నారులకు, బిస్కెట్లు, హెల్త్ కిట్టులను పంపిణీ చేశారు. వరద బాధితులతో గవర్నర్ ప్రత్యేకంగా మాట్లాడారు. అయితే తమను కలువకుండా అధికారులతో మాత్రమే మాట్లడటం ఏంటని స్థానికులు ఆందోళనకు దిగారు.

ఈ నేపథ్యంలో వరద బాధితుల నుంచి గవర్నర్ కు నిరసన సెగ తగిలింది. మహిళలు అరుపులు, కేకలతో తీవ్ర నిరసనల మధ్య గవర్నర్ గెస్ట్ హౌస్ కు వెనుదిరిగి వెళ్లిపోయారు. అంతకుముందు పాములపల్లి గ్రామాన్ని సందర్శించారు. భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. అలాగే చింత్రియాల గ్రామాన్ని సందర్శించారు. వరద బాధితుల ఇళ్లను పరిశీలించారు. వర్షాల కారణంగా సర్వం కోల్పోయిన వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం HWPM కాలనీలో నిత్యావసరాలు, మెడికల్ కిట్లు అందజేశారు. వరద బాధితులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.