భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై పర్యటన

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో వరి యుద్ధం తో పాటు గవర్నర్ vs తెరాస సర్కార్ వార్ నడుస్తుంది. రీసెంట్ గా ఢిల్లీ వేదిక గా గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై..రాష్ట్ర ప్రభుత్వ తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ఆరోపణలు చేసింది. దీనిపై తెరాస నేతలు సైతం గవర్నర్ తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేసారు. ఇదిలా ఉంటె ఈరోజు నుండి భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై రెండు రోజుల పర్యటన చేయబోతున్నారు.

ఈ ప‌ర్య‌ట‌న కోసం గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై.. ఆదివారం రైలు ద్వారా భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాకు చేరుకున్నారు. నేడు ముందుగా భ‌ద్రాద్రి రామాయ్య మ‌హా ప‌ట్టాభిషేక మ‌హోత్స‌వంలో గ‌వ‌ర్న‌ర్ తమిళి సై పాల్గొన‌నున్నారు. సీతా రామ‌య్య ద‌ర్శ‌నం అనంత‌రం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. గిరిజ‌న ప్ర‌జ‌ల‌కు ఉన్న పోషకాహార లోపం నుంచి స‌మ‌స్య నుంచి విముక్తి క‌ల్పించ‌డానికి చేపుడుతున్న ప‌నులను అక్క‌డ ప్రారంభించ‌నున్నారు. అలాగే కొండ రెడ్ల తెగ‌కు చెందిన రెండు ద‌త్త గిరిజ‌న గ్రాములు అయిన పూసుకుంట‌, గోగుల‌పూడీలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై ప‌లు కార్యక్ర‌మాలు చేప‌ట్ట‌నున్నారు.