శంకర్, కమల్ హాసన్ లకు పోలీసుల నోటీసులు

భారతీయుడు2 చిత్రం షూటింగ్ లో క్రేన్ ప్రమాదం.. ఘటనలో మరణించిన ముగ్గురు టెక్నీషియన్లు

kamal-shankar
kamal-shankar

చెన్నై: తమిళనాడులో బుధవారం రోజు కమల్ హాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు2 చిత్రం షూటింగ్ లో జరిగిన పెను ప్రమాదం ముగ్గురు యువ టెక్నీషియన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు పెట్టిన పోలీసులు, ఐపీసీలోని 4 సెక్షన్లు జోడించారు. విచారణకు రావాలని శంకర్, కమల్ హాసన్, క్రేన్ ఆపరేటర్ లతో పాటు క్రేన్ యజమాని, ప్రొడక్షన్ మేనేజర్ లకు నోటీసులు పంపించారు. వీరంతా 25వ తేదీలోపు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/